శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 10:41:33

బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా స‌మంత‌..!

బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా స‌మంత‌..!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో 12 మంది స‌భ్యులు ఉండ‌గా, ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక గ‌త సీజ‌న్‌తో పాటు ఈ సీజ‌న్‌ని కూడా హోస్ట్ చేస్తున్న నాగార్జున ప్రేక్ష‌కుల‌లో ఈ షోపై మరింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నారు.

శ‌ని, ఆదివారాల‌లో నాగార్జున సంద‌డి ఇటు ప్రేక్ష‌కుల‌తో పాటు అటు హౌజ్‌మేట్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్‌లో భాగంగా నాగార్జున త‌న టీంతో క‌లిసి మ‌నాలీకి వెళ్ళారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఈ శ‌ని, ఆది వారాల‌లో బిగ్ బాస్ షోని హోస్ట్ చేయ‌డ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న స్థానంలో నాగ్ కోడ‌లు స‌మంత బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్ట‌నుంద‌ని స‌మాచారం.