శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 19:08:29

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులోనూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. ఈయనకు ఇప్పుడు రజినీకాంత్ కంటే ఎక్కువ మార్కెట్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈయన సినిమాలు తెలుగులో కూడా విజయం సాధిస్తున్నాయి ఇప్పుడు. ఇదిలా ఉంటే విజయ్ ఇప్పుడు తన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కు లీగల్ నోటీసులు పంపించాడు. ఇదే ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తన న్యాయవాది నుంచి తండ్రికి న్యాయపరమైన నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కూడా రాజకీయాలే. గతేడాది జూన్‌లో విజయ్ పేరుతో ఎస్ఏ చంద్రశేఖర్ ఓ పార్టీ స్థాపించాడు. అయితే దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని..తన అభిమానులు ఎవరూ కూడా తండ్రికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు విజయ్. 

ఇప్పుడు ఇదే విషయంపై తండ్రికి నోటీసులు పంపించాడు విజయ్. చంద్రశేఖర్ పార్టీకి సంబంధించిన ఏ పనికి కూడా తన క్లైంట్ విజయ్‌ ఏ విధంగానూ బాధ్యుడు కాదని..మద్దతు ప్రకటించలేదని చెప్పారు లాయర్. అంతేకాదు మీరు స్థాపించిన పార్టీలో విజయ్‌ పేరు కానీ..ఫొటో కానీ వాడకూడదని..అలా వాడితే మాత్రం కచ్చితంగా న్యాయపరమైన చర్యలు తప్పవని ఆ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్టయితే కచ్చితంగా చర్యలు తప్పవంటున్నాడు విజయ్ తరఫు న్యాయవాది. అఖిల భారత దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం అనే పేరుతో చంద్రశేఖర్ ఓ రాజకీయ పార్టీని రిజిస్టర్‌ చేయించాడు. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అదే రోజు సాయంత్రం విజయ్ ప్రకటన విడుదల చేసాడు. ఇదిలా ఉంటే తమిళనాడులో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ ఎన్నికల్లో విజయ్ సొంత పార్టీతో బరిలోకి దిగుతారని..అందుకే ఆయన తండ్రి కొత్త పార్టీని స్థాపించాడని వార్తలొచ్చాయి. అభిమానులెవరూ ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పుడే తెలిపాడు విజయ్. ఇందుకు సంబంధించి ఏదైనా ప్రకటన ఉంటే.. స్వయంగా తానే చేస్తానని విజయ్ చెప్పాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ గుర్తుతో పోటీ చేసేందుకు సీనియర్ హీరో కమల్ హాసన్ సిద్ధమయ్యాడు. మరోవైపు రజినీకాంత్ మాత్రం రేసు నుంచి తప్పుకున్నాడు. ఏదేమైనా కూడా విజయ్ తన తండ్రికి నోటీసులు పంపడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo