బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 28, 2020 , 16:05:46

సింగం 3లో స్టార్ హీరో గెస్ట్ రోల్‌

సింగం 3లో స్టార్ హీరో గెస్ట్ రోల్‌

ముంబై: బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి సింగం, సింగం 2 సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద ఏ స్తాయిలో హిట్టుగా కొట్టాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అజ‌య్ దేవ్‌గ‌న్ మ‌రోసారి సింగం ప్రాంఛైజీలో సింగం 3 చేసేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త బాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. సింగం 3లో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

ఈ చిత్రంలో అక్ష‌య్‌ను న‌టించాల‌ని రోహిత్ శెట్టి కోరిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉంద‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒక‌వేత ఈ వార్త‌ నిజ‌మైతే సిల్వ‌ర్ స్క్రీన్ పై స్టార్ హీరోలిద్ద‌రూ త‌మ అభిమానుల‌కు వినోదాన్ని అందించ‌డం ఖాయ‌మైన‌ట్టే. క‌రోనా ఎఫెక్ట్‌తో ఈ సినిమా ప్రారంభంలో కాస్త జాప్యం జ‌రిగిన‌ట్లు తెలుస్తోండ‌గా..క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టాక మ‌రో 2,3 నెలల్లో షూటింగ్ షురూ కానుంద‌ట‌.  logo