శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 10:37:51

సంజ‌య్ ద‌త్ ప్లేస్‌లో సుదీప్.. వ‌చ్చిన క్లారిటీ

సంజ‌య్ ద‌త్ ప్లేస్‌లో సుదీప్.. వ‌చ్చిన క్లారిటీ

బాహుబ‌లి తర్వాత సౌత్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం కేజీఎఫ్‌. యశ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం కేజీఎఫ్ చిత్రానికి కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2 రూపొందుతుండ‌గా, క‌రోనా వ‌ల‌న షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. అయితే ఈ చిత్రంలో అధీరాగా సంజ‌య్ ద‌త్ న‌టిస్తుండ‌గా, ముందుగా సుదీప్‌ని సంప్ర‌దించిన‌ట్టు పుకార్లు షికారు చేశాయి. దీనిపై తాజాగా స్పందించారు సుదీప్

సంజ‌య్ ద‌త్ పాత్ర‌కి త‌న‌ని సంప్ర‌దించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ని న‌వ్వుతూ ఖండించాడు సుదీప్. కేజీఎఫ్ 2 లో న‌న్ను ఏ పాత్ర కోసం సంప్ర‌దించ‌లేదు. చాప్ట‌ర్ 1 పూర్తైన‌ప్పుడు సినిమ చూడ‌టానికి ఆహ్వానం అందించింది. సీక్వెల్‌లో సంజ‌య్ సార్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అత‌నిలా నేను న‌టించ‌లేను అని సుదీప్ విన‌య‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo