శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 20:48:10

అనుష్కను స్టార్ డైరెక్టర్స్ పట్టించుకోవడం లేదా..?

అనుష్కను స్టార్ డైరెక్టర్స్ పట్టించుకోవడం లేదా..?

ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఒకప్పుడు ఈమె కోసం క్యూ కట్టిన స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు ఇప్పుడు అసలు అనుష్క శెట్టి పేరు కూడా తలుచుకోవడం లేదు. ఇప్పుడు అంతా అనుష్క శెట్టి అంటే చిత్ర మాత్రమే. టాలీవుడ్‌లో ఒకప్పుడు బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ అనుష్క అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిప్పుడు. అయినా ఇది ఆమె తప్పు కూడా కాదు. ఎందుకంటే మెడిసిన్‌కు కూడా ఏదో ఓ రోజు ఎక్స్‌పైరీ ఉంటుందని అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు..అనుష్క పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఈ భామ కెరీర్ కూడా ఇప్పుడు అలాగే మారిపోయింది. కొన్నేళ్ల కింద వరకు వరస సినిమాలతో దుమ్ము దులిపేసిన జేజమ్మ.. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోయింది. అవకాశాలు కూడా రావడం లేదు. 

బాహుబలి తర్వాత సినిమాలు ఒప్పుకోవడం కూడా లేదు స్వీటీ. భాగమతి సినిమా చేసినా కూడా అది ఎప్పుడో ఒప్పుకున్నది. గతేడాది నిశ్శబ్ధం సినిమాతో వచ్చింది జేజమ్మ. అయితే ఈ సినిమా వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. అంతపెద్ద డిజాస్టర్ అయింది నిశ్శబ్ధం. టైటిల్ కు తగ్గట్లుగానే సైలెంట్ గా వచ్చెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు అనుష్క కెరీర్ డైలమాలో పడింది. పైగా ఆమె వయసు కూడా 40కి చేరువైంది. దాంతో స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. కుర్ర హీరోలకు సరిపోయే ఫిజిక్ కాదు ఈమెది. అందుకే అవకాశాల కోసం చూస్తుంది. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఒకానొక సమయంలో అనుష్క సినిమాలకు బాగానే మార్కెట్ ఉన్నా ఇప్పుడు మాత్రం అంత సీన్ లేదు. 

వరస పరాజయాలతో జేజమ్మ మార్కెట్ దారుణంగా పడిపోయింది. మొన్నటికి మొన్న నిశ్శబ్ధం సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు దాదాపు 15 కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. దాంతో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తో కమిటైన సినిమాను ఇప్పుడు హోల్డ్ లో పెట్టింది అనుష్క. ఎవరైనా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చూస్తుంది. కానీ స్టార్ హీరోలతో పాటు దర్శకులు కూడా అనుష్కను సీనియర్ హీరోయిన్ గానే చూస్తున్నారు కానీ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న బ్యూటీగా చూడటం లేదు. అంతెందుకు చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా అనుష్కకు అవకాశం ఇవ్వడం లేదు. పైగా దర్శక నిర్మాతలు కూడా ఒకప్పట్లా అనుష్కపై ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు. దాంతో స్వీటీ కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈమె కెరీర్ గాడిన పడాలంటే ఏదో ఓ అద్భుతం అయితే జరగాల్సిందే.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo