మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 21:48:10

ఇద్ద‌రు స్టార్ హీరోల పేర్ల‌ను ప‌రిశీలిస్తోన్న లోకేశ్‌..!

ఇద్ద‌రు స్టార్ హీరోల పేర్ల‌ను ప‌రిశీలిస్తోన్న లోకేశ్‌..!

లోకేష్ క‌న‌గ‌రాజ్..అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే రీతిలో సినిమా తీయ‌డంక‌లో కోలీవుడ్ డైరెక్ట‌ర్ స్టైలే వేరు. లోకేశ్ గ‌తేడాది ఖైదీ చిత్రంతో కార్తీకి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమా అందించాడు. ప్ర‌స్తుతం ఈ డైరెక్ట‌ర్ స్టార్ హీరో విజ‌య్ తో మాస్ట‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజ‌య్ సేతుపతి విల‌న్ గా న‌టిస్తున్నాడు. 

లోకేశ్ తెలుగులో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోన్న‌ విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్  లోకేశ్ తో సినిమా చేసేందుకు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఈ సంస్థ లోకేశ్ క‌న‌గ రాజ్ తో సినిమాకు సంత‌కం చేయించుకున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. లోకేశ్ త‌న త‌ర్వాత సినిమాను మ‌హేశ్ బాబుతోకానీ రాంచ‌ర‌ణ్ తో కానీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట. ఒక‌వేళ ఈ ఇద్ద‌రి స్టార్ల‌లో ఎవ‌రితో సినిమా చేసినా..ఈ సారి లోకేశ్ ఎలాంటి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తాడనేది చూడాలి మ‌రి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo