గురువారం 04 మార్చి 2021
Cinema - Aug 26, 2020 , 20:52:56

నిలకడగా బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి : చరణ్‌

నిలకడగా బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి : చరణ్‌

చెన్నై : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుమారుడు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ దవాఖానలో తండ్రిని సందర్శించానని, నాన్న పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆయనతో మాట్లాడినట్లు తెలిపారు. తన ఆలోచనలను తెలియజేయడానికి ఎస్పీబీ ఏదో రాయడానికి ప్రయత్నించినప్పటికీ పెన్ను సరిగ్గా పట్టుకోలేకపోయారని చరణ్‌ తెలిపాడు. ఈ వారం చివరి నాటికి తన తండ్రి రాయగలడని చరణ్ నమ్మకంగా చెప్పారు.

ఎస్పీబీ బాగా కోలుకుంటున్నారని, మరింత మెళకువగా ప్రతిస్పందిస్తున్నారని చరణ్ చెప్పాడు. బయట ఏం జరుగుతుందో నాన్నకు తెలిసేలా ఆయన ముందు ప్రతిరోజూ ఒక వార్తాపత్రిక చదవమని చరణ్ దవాఖాన సిబ్బందిని అభ్యర్థించినట్లు తెలిపాడు. దీనివల్ల తన తండ్రి నెమ్మదిగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఎంజీఎం వైద్యులు మాట్లాడుతూ ఎస్పీబీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌లో స్వల్ప మెరుగుదల ఉందని, మత్తు లేకుండా ఆయన సౌకర్యవంతంగా ఉంటున్నారని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo