సోమవారం 01 మార్చి 2021
Cinema - Jun 27, 2020 , 00:17:13

మాహిష్మతిలో కూడా మాస్క్‌ ఉండాల్సిందే!

మాహిష్మతిలో కూడా మాస్క్‌ ఉండాల్సిందే!

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలువురు సెలబ్రిటీలు వివిధ వేదికల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా అగ్ర దర్శకుడు రాజమౌళి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. ‘బాహుబలి ది కంక్లూజన్‌' చిత్రం ైక్లెమాక్స్‌లో బాహుబలి, భల్లాలదేవ మధ్య పోరు జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకరికళ్లల్లోకి ఒకరు తీక్షణంగా చూసుకునే సీన్‌ ఉంటుంది. దీనిని యునైటెడ్‌ సాఫ్ట్‌ అనే విజువల్‌ ఎఫెక్ట్‌ సంస్థ ఎడిట్‌ చేసింది. ప్రభాస్‌, రానా ఇద్దరు సర్జికల్‌ మాస్క్‌లు ధరించి తలపడుతున్నట్లుగా చూపించింది. చివరగా ‘ఇప్పుడు మాహిష్మతిలో కూడా మాస్క్‌లు ధరించడం తప్పనిసరి’ అంటూ సందేశాత్మక వ్యాఖ్యను జోడించారు. ఈ వీడియోను రాజమౌళి షేర్‌ చేశారు. ఎడిటింగ్‌ వర్క్‌ అద్భుతంగా ఉందని కొనియాడుతూ ప్రజలందరూ కరోనా బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

VIDEOS

logo