మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 10:31:50

స‌లార్ కథానాయిక‌ని ప్ర‌క‌టించిన చిత్ర బృందం

స‌లార్ కథానాయిక‌ని ప్ర‌క‌టించిన చిత్ర బృందం

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్న చిత్రం స‌లార్. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి నుండి షూటింగ్ జ‌రుపుకోనుంది. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ప‌ది రోజుల పాటు యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సెట్టింగ్‌ పనులు పూర్తవగానే నటీనటులు, చిత్రబృందం అక్క‌డ వాల‌నుంది. సింగరేణి అతిథి గృహాలను వారికి కేటాయించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా దిశా ప‌టానీ, శృతి హాస‌న్‌ల పేర్లు వినిపించ‌గా, చివ‌రికి శృతి హాస‌న్‌ని క‌న్‌ఫాం చేశారు. ఈ రోజు శృతి 35వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్‌తో తొలిసారి శృతి హాస‌న్ న‌టిస్తున్న నేప‌థ్యంలో ఈ క్రేజీ కాంబోపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.  కాగా, శృతి హాస‌న్ న‌టించిన క్రాక్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి హిట్ సాధించ‌గా, ఇప్పుడు శృతి మ‌రో చిత్రం వ‌కీల్ సాబ్ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

VIDEOS

logo