టాలీవుడ్ లోనే కాదు మొత్తం దేశంలోనే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ప్రభాస్ తో నటించాలని కలలు కంటున్నారు. ఆ సిక్స్ ఫీట్ కటౌట్ అలా ఉంటుంది మరి. చూడగానే ఎవరైనా ఇట్టే పడిపోతారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనతో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడేలా కనిపిస్తుంది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగిన షూటింగ్ కు ఇప్పుడు కరోనా బ్రేకులు వేసింది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సలార్ తెరకెక్కుతుంది. 2022 ఎప్రిల్ 14న సలార్ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడిన కారణంగా విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి అభిమానులతో ముచ్చటించింది. ముఖ్యంగా ప్రభాస్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆయనెలాంటి వాడు.. షూటింగ్ లో ఎలా ఉంటాడు అనేది కూడా చెప్పుకొచ్చింది.
మరీ ముఖ్యంగా ప్రభాస్ చాలా మంచివాడని.. అంత సింపుల్ గా ఉంటాడని అస్సలు అనుకోలేదని చెప్పుకొచ్చింది. తను ఒక్క ముక్కలో చెప్పాలంటే స్వీట్ హార్ట్ అని చెప్పింది శృతి హాసన్. ఆయనతో ఒక్క సినిమా కాదు ఎన్ని సినిమాలైనా నటించొచ్చు అంటుంది శృతి హాసన్. తన కెరీర్ లో ప్రభాస్ లాంటి డార్లింగ్ ను అస్సలు చూడలేదని.. సెట్ లో కూడా తాను స్టార్ హీరో అనే విషయం కూడా పూర్తిగా మరిచిపోతాడని చెప్పింది ఈమె. మొన్నామధ్య పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే ఎపిక్ అనే సమాధానమిచ్చింది. మహేష్ బాబు గురించి జెంటిల్ మెన్ అంటూ సమాధానమిచ్చింది. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల మనసు కూడా దోచేసింది శృతి హాసన్.
ఇవికూడా చదవండి..