మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 13:11:38

స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్!

స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్!

వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌భాస్ ఇటీవ‌ల  రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలోనే జ‌రిగింది. ఇక వ‌చ్చే నెల‌లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌లార్ చిత్రంతో పాటు బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఔం రౌత్ డైరెక్ట్ చేయ‌నున్న ఆదిపురుష్ సినిమాల‌ని ఏక‌కాలంలో షూటింగ్ చేయ‌నున్నాడు . ఈ  సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

స‌లార్ సినిమాలో దిశా పటానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా, తాజాగా కొత్త పేరు వెలుగులోకి వ‌చ్చింది. దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ఉన్న శృతి హాస‌న్ అయితే ప్ర‌భాస్‌కు స‌రైన జోడి అని, రెమ్యున‌రేష్ విష‌యంలోను ఈ అమ్మడితో పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చ‌ని నిర్మాత‌లు భావించారట‌. అందుకే ఆమెతో సంప్ర‌దింపులు కూడా చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానున్న‌ట్టు స‌మాచారం. శృతి న‌టించిన క్రాక్ చిత్రం రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. ప్ర‌స్తుతం ప‌లు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

VIDEOS

logo