బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 10:51:55

షూటింగ్ మధ్య‌లో ఆపేసి వెళ్ళిన శృతి హాసన్

షూటింగ్ మధ్య‌లో ఆపేసి వెళ్ళిన శృతి హాసన్

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాసన్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వైవిద్య‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తున్న శృతి త‌మిళంలో లాభం అనే సినిమా చేస్తుంది. విజ‌య్ సేతుప‌తి హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్ కు సంబంధించిన పార్ట్  చిత్రీక‌రించే ప్లాన్ చేశారు మేక‌ర్స్.  ఎనిమిది నెల‌ల ఇంటికే ప‌రిమిత‌మైన శృతి కూడా షూటింగ్‌లొ పాల్గొనేందుకు సిద్ద‌మైంది.

త‌మిళ నాడు ప‌రిస‌ర ప్రాంతాల‌లో లాభం క్లైమాక్స్ చిత్రీక‌రిస్తుండ‌గా, శృతి కూడా పాల్గొంది. అయితే వీరిని చూసేందుకు జ‌నాలు భారీగా వ‌చ్చార‌ట‌. ఇది గ‌మ‌నించిన శృతి క‌రోనా భ‌యంతో షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆపేసి ఇంటికి వెళ్ళిపోయింద‌ట‌. క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా మూవీ షూట్ ఎలా చేస్తారంటూ ఫైర్ అయిన‌ట్టు స‌మాచారం. 

 క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ప్రోటోకాల్స్ పాటించ‌ని ప‌క్షంలో .. ఓ మ‌హిళ‌గా, న‌టిగా, నా భ‌ద్ర‌త కోసం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకునే హ‌క్కు నాకుంది అని ట్వీట్ చేసింది శృతి.  


logo