శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 19, 2020 , 11:33:39

శృతి హాస‌న్‌కి ఆర్ధిక స‌మ‌స్య‌లా ?

శృతి హాస‌న్‌కి ఆర్ధిక స‌మ‌స్య‌లా ?

క‌మ‌ల్ గారాల‌ ప‌ట్టి శృతి హాస‌న్ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంద‌నే వార్త‌లు ఊపందుకున్నాయి. ఒక‌ప్పుడు  తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో అల‌రించిన శృతికి ఆర్ధిక స‌మ‌స్య‌లేంటీ అన్ని స‌న్నిహితుల‌ని ప్ర‌శ్నించ‌గా,  కొన్నాళ్లు సినిమాల‌కి దూరంగా ఉండ‌డంతో పాటు ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఆర్ధిక లావాదేవీలేవి జ‌ర‌గ‌క‌పోవ‌డంతో శృతికి ఆర్ధిక స‌మ‌స్య‌లు తలెత్తాయ‌ని అంటున్నారు. 

త‌న తండ్రిని అడిగితే ఇస్తారు కాని , అలా అడ‌గ‌డం ఇష్టం లేద‌ని శృతి చెబుతుంద‌ట‌.  ఎవరిపైన‌ ఆధారపడి బతకకూడదన్నది తన అభిమతం కాదని చెప్పింది. కాగా, శృతి కొన్నాళ్ళు ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన ఆ సంగ‌తి తెలిసిందే. ఆ టైంలో సినిమాల‌కి పూర్తిగా దూరంగా ఉంది. ఇటీవ‌ల తిరిగి సినిమాలు మొద‌లు పెట్టిన ఈ అమ్మ‌డు  రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ప‌వ‌న్ సినిమాలోను శృతి క‌థానాయిక‌గా ఎంపికైందని వార్త‌లు వ‌స్తున్నాయి.


logo