బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 06, 2020 , 11:04:05

మాస్క్ త‌యారీని వీడియో ద్వారా చూపించిన శ్రీముఖి

మాస్క్ త‌యారీని వీడియో ద్వారా చూపించిన శ్రీముఖి

క‌రోనా రోజురోజ‌కి విజృంభిస్తుండ‌డంతో దాని నుండి ఎలా కాపాడుకోవాలో తెలియ‌క ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. బ‌య‌ట‌కి వెళ్ళిన‌ప్పుడు ముఖానికి త‌ప్ప‌క మాస్క్ ధ‌రించి వెళ్ళాలి అని చెబుతున్న‌ప్ప‌టికీ, మాస్కుల క‌రువు ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డంతో ప్ర‌జ‌ల‌కి ఏం చేయాలో అర్దం కావ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో కొంద‌రు ఇంట్లోనే మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు.

తాజాగా ప్ర‌ముఖ‌ యాంకర్ శ్రీముఖి ఇంట్లోనే మాస్క్ ఎలా త‌యారు చేసుకోవాలో వీడియో ద్వారా చూపించింది. ఓ క్లాత్‌, రెండు ర‌బ్బ‌ర్ బ్యాండ్స్ తీసుకొని మాస్క్ త‌యారు చేసింది.  ఇది చూసిన తర్వాత అభిమానులు కూడా అమ్మడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. మాస్క్ తయారీ చూపించడమే కాదు.. మాస్క్‌ లేకుండా బయటికి వెళ్లొద్దని జాగ్రత్తలు కూడా చెప్పింది శ్రీముఖి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని.. ఒకవేళ వెళ్లినా కూడా సోషల్ డిస్టేన్సింగ్ మరిచిపోవద్దని చెబుతుంది అందాల యాంక‌ర్‌.logo