శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 02, 2020 , 13:34:19

రేప‌టి నుంచి డీడీలో శ్రీకృష్ణ సీరియ‌ల్‌

రేప‌టి నుంచి డీడీలో శ్రీకృష్ణ సీరియ‌ల్‌

 లాక్డౌన్ వేళ ఇప్ప‌టికే దూర‌ద‌ర్శ‌న్‌లో రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లను పునఃప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు అదే లిస్ట్‌లో మ‌రో సీరియ‌ల్ వ‌చ్చి చేరింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మ‌రోసారి పొడ‌గించిన నేప‌థ్యంలో డీడీ నేషనల్ ఇప్పుడు శ్రీకృష్ణను కూడా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది.  రామాయణం, మహాభారతం  పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో ఆ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోయింది. స‌రికొత్త రేటింగ్స్‌తో  ప్రైవేటు ఛానెళ్లకు పోటీగా నిలుస్తోంది. ఈక్ర‌మంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను..డీడీ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సీరియల్‌ రేపటి నుంచే ప్రసారమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్  ప్రకటించారు. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న‌ద‌ని ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా,రామానంద సాగర్ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 1993 నుంచి 1996 వరకు దూరదర్శన్‌లో ప్రసారమైంది.


logo