శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. వడత్య హరీష్ దర్శకుడు. మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ చిత్రాన్ని హోం మంత్రి మహమూద్ అలీ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ ఉద్యమ కష్టాలను హృద్యంగా సినిమాలో చూపించారు. ఉద్యమనాయకుడిగా శ్రీకాంత్ నటన బాగుంది. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంత పరిస్థితులను చూసి చలించిపోయి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహనీయుడి జీవితాన్ని చక్కగా సినిమాలో ఆవిష్కరించారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నందన్ బొబ్బలి.