గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 19, 2020 , 00:17:06

నరసింహపురం మిస్టరీ

నరసింహపురం మిస్టరీ

నందకిశోర్‌, సిరిహనుమంతు నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్‌ బళ్ళా దర్వకత్వం వహిస్తూ  టి.ఫణిరాజ్‌గౌడ్‌, నందకిశోర్‌ ధూళిపాలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టైటిల్‌ ఆసక్తిని పంచుతోంది. నేపథ్యసంగీతం, నటీనటుల అభినయం బాగున్నాయి. నా స్నేహితుడు నందకిశోర్‌కు ఈ చిత్రం మంచి పేరుతెచ్చిపెట్టాలి’ అని ఆకాంక్షించారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నరసింహపురంలో ఏం జరిగిందన్నది ఉత్కంఠను పంచుతుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం పతాక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు. ఏడాదిన్నర   కష్టానికి ప్రతిఫలమే ఈ సినిమా అని నందకిశోర్‌ పేర్కొన్నారు. ఉష, విజయ్‌కుమార్‌, కల్యాణమాధవి ప్రధాన పాత్రల్లో  నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఫ్లాంకిన్‌ సుకుమార్‌. 


logo