శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 11:32:20

క‌ళ్ళ‌తో ఎక్స్‌ప్రెషన్స్‌.. శ్రీజ‌, క‌ళ్యాణ్ వీడియో వైర‌ల్

క‌ళ్ళ‌తో ఎక్స్‌ప్రెషన్స్‌.. శ్రీజ‌, క‌ళ్యాణ్ వీడియో వైర‌ల్

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొద్ది రోజుల క్రితం క‌ళ్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వారిరివురు దాంప‌త్య జీవితాన్ని చాలా సంతోషంగా గ‌డుపుతున్నారు. ఇక వీరిద్ద‌రికి న‌విష్క అనే కూతురు కూడా ఉంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్‌లు త‌ర‌చు ఇంటి, బ‌య‌ట విష‌యాల‌కు సంబంధించిన ప‌లు పోస్ట్‌లు షేర్ చేస్తూ నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు.

తాజాగా శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేయ‌గా ఇందులో  భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ తో క‌లిసి ప‌లు ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చింది. అంతేకాదు ఆ వీడియోకు నీకు సంతోషంగా ఉన్న‌ప్పుడు నీకు తెలుస్తుంది. ఆ సంతోషాన్ని చూపించు క‌ళ్యాణ్ దేవ్ అనే కామెంట్ పెట్టింది. ఈ జంట ఇచ్చిన  ఎక్స్ ప్రెష‌న్స్‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు.  క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో వెండితెర‌కు ఎంట్రీ ఇవ్వ‌గా ప్ర‌స్తుతం సూప‌ర్ మ‌చ్చీ అనే చిత్రం చేస్తున్నాడు.