మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 23:55:10

కోతి కొమ్మచ్చి వినోదం

కోతి కొమ్మచ్చి వినోదం

మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న  కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. రిద్ధికుమార్‌, మేఘాచౌదరి కథానాయికలు.  ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, హీరో అల్లరి నరేష్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నవంబర్‌ మూడు నుంచి అమలాపురంలో షూటింగ్‌ ప్రారంభిస్తాం.  సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. హీరోలుగా మేఘాంశ్‌, సమీర్‌లకు శుభారంభాన్ని అందించే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.