ప్రముఖ దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. వినోదరంగంలో అం తర్జాతీయ పేరుప్రఖ్యాతులు కలిగిన సోని ఓటీటీ విభాగం ‘సోని లివ్’ తెలుగు కంటెంట్ హెడ్‌గా మధుర శ్రీధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓ దిగ్గజ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ‘సోని లివ్’కు ఉన్న ప్రతిష్టను మరింతగా పెంపొందించేందుకు శ్రమిస్తాను. కొత్తదనం కలబోసిన వైవిధ్యమైన తెలుగు కంటెంట్‌ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యేలా కృషిచేస్తాను’ అన్నా రు. తనకున్న విస్తృత అనుభవంతో ‘సోని లివ్’ను మధుర శ్రీధర్‌రెడ్డి గొప్పగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉందని సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కంటెంట్ హెడ్ అశిష్ గోల్వాకర్ పేర్కొన్నారు.