సుధీర్ బాబు, ఆనంది కలిసి నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా రూపొందిన ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకుడు. ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యాక్షన్ తో కూడిన ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కించారు.
ఇందులో నరేష్ కీలక పాత్రలో కనిపించి సందడి చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సంగీతం అందించారు. రీసెంట్గా విడుదలైన సినిమాకి మంచి విజయం దక్కింది.మహేష్ బాబు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు.అయితే చిత్రంలో శ్రీదేవిగా నటించిన ఆనంది ప్రమోషన్స్‌లో కాని , ఇటు రిలీజ్ తర్వాత కాని ఎక్కడా కనిపించలేదు.
ఆనంది పాత్రకు అంత ప్రాముఖ్యత ఇచ్చి సినిమా తీస్తే అసలు ఈ అమ్మడు కనబడకుండా పోయిందేంటని ప్రతి ఒక్కరు ముచ్చటించుకున్నారు.అయితే అసలు విషయం ఏంటంటే ఇటీవల ఆనందిని పెళ్లి చేసుకోగా , రీసెంట్గా తల్లి అయిపోయింది. అందుకే… ప్రమోషన్లకు రాలేకపోతున్నా అని చెప్పిందట. దీంతో అందరు సైలెంట్ అయ్యారు.