శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 10:38:55

శ్రీదేవి కూతురితో ద‌ర్శ‌కేంద్రుడి పెళ్లి సంద‌డి..!

శ్రీదేవి కూతురితో ద‌ర్శ‌కేంద్రుడి పెళ్లి సంద‌డి..!

ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన ఆణిముత్యాల‌లో పెళ్ళి సంద‌డి చిత్రం ఒక‌టి. శ్రీకాంత్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో మోడ్ర‌న్‌గా మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు రాఘవేంద్ర‌రావు. ఇందులో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టిస్తుండ‌గా, హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై మాత్రం స‌స్పెన్స్‌లో పెట్టారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో ఇద్ద‌రు క‌థ‌నాయిక‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. 

అతిలోక సుంద‌రి శ్రీదేవితో క‌లిసి ఎన్నో అద్భుత చిత్రాలు తెర‌కెక్కించిన రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు ఆమె చిన్న కూతురు ఖుషి క‌పూర్‌ని పెళ్లి సంద‌డిలో హీరోయిన్‌గా తీసుకున్నార‌ట‌. మ‌రో హీరోయిన్‌గా మల‌యాళ బ్యూటీ మాళ‌విక నాయ‌ర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.  దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రానికి  రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహించనున్నారు. ఆక్రా మీడియా వర్క్స్ సమర్పణలో రాఘవేంద్ర రావు సోదరుడు కె. కృష్ణమోహన్ రావు నిర్మించనున్నారు.  కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.


logo