ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 09:05:25

నారా రోహిత్, నివేదాల‌కి ప్లాస్మా ఛాలెంజ్ విసిరిన శ్రీ విష్ణు

నారా రోహిత్, నివేదాల‌కి ప్లాస్మా ఛాలెంజ్ విసిరిన శ్రీ విష్ణు

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఛాలెంజ్‌లు వ‌చ్చి వెళ్ళాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ప్లాస్మా ఛాలెంజ్ న‌డుస్తుంది. యువ హీరో శ్రీ విష్ణు ఇలాంటి స‌మ‌యంలో ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌లిగించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని భావించి ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాడు.  ‘డొనేట్ ప్లాస్మా’ పేరిట క్యాంపైన్‌ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ‘డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్’ అని రాసున్న ఇమేజ్‌ను ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని హీరో నారా రోహిత్, హీరోయిన్ నివేదా థామస్‌కు పిలుపునిచ్చారు

కరోనా కష్టకాలంలో ప్లాస్మా గురించి అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడాలని శ్రీవిష్ణు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ఎందరో కరోనా కాటుకి బ‌లైపోతున్నారు. అలాంటి వారిని కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీతో కాపాడొచ్చ‌ని , అందుకే కరోనా నుండి కోలుకున్న‌ ప్ర‌తి ఒక్కరు ప్లాస్మా దానం చేయాల‌ని శ్రీ విష్ణు కోరుతున్నారు. 

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo