అతని నుండి నాకు ప్రాణహాని ఉంది..

గత ఏడాది మే 26న శ్రీ సుధ అనే మహిళ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఎస్సాఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నన్ము నమ్మించి మోసం చేశాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ సమయంలో శ్యామ్ కె నాయుడు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టులో దాఖలు చేసినట్టు శ్రీ సుధ పేర్కొంది. ప్రస్తుతం నేను పెట్టిన కేసును అతను ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అతని నుండి నాకు ప్రాణహాని ఉంది అని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేసింది.
సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటి.. శ్యామ్ కె.నాయుడిపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని బెదిరిస్తున్నారంటూ శ్రీసుధ స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్ట్ 5న మాదాపూర్‌లోని చిన్నా నివాసంలో శ్యామ్ కె నాయుడు, సాయిరాం, మాగంటి తదితరులు మీట్ అయి నన్ను అక్కడికి పిలిచారు. ఆ సమయంలో నాపై శారీరక దాడి చేయడంతో పాటు బెదిరించారు. ఆ భయానికి ఇప్పటి వరకు ముందుకు రాలేదు. ప్రస్తుతం శ్యామ్ కె.నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మిత్రులతో ప్రాణహాని ఉన్నందున మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు శ్రీసుధ. అయితే చిన్నా నివాసం మాదాపూర్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ముందుగా శ్రీసుధ ఫిర్యాదు మేరకు ఎస్సాఆర్ నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.