కీరవాణి తనయుడి బర్త్‌డే.. రెండు సినిమాలు ప్రకటన

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి మత్తు వదలరా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం తెల్లవారితే గురువారం, భాగ్ సాలే అనే చిత్రాలు చేస్తున్నాడు శ్రీ సింహ. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా తెల్లవారితే గురువారం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న శ్రీ సింహ సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ చిత్రాన్ని మణికాంత్ జెల్లి తెరకెక్కించారు.
ఇక శ్రీ సింహ హీరోగా భాగ్ సాలే అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న “భాగ్ సాలే” మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజావార్తలు
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!
- రాజన్న హుండీ ఆదాయం రూ. 40.56 లక్షలు
- నయనతార పెళ్లిపై క్రేజీ గాసిప్..!
- ఆడపిల్లకు సాదర స్వాగతం.. మురిసిన కుటుంబం
- సిలిండర్ ధర ఎంత పెరిగినా.. మారని రాయితీ!