కెమెరా ముందు విలక్షణ పాత్రల్లో నటించి భావితరాలకు చిరస్మరణీయలుగా నిలిచిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. మే 28వ తేదీ 1923 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన నందమూరి తారక రామారావు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు.
ఎన్టీఆర్ తన ప్రతిభను నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ శ్రీరామ దండకం ఆలపించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోని తమ ట్విట్టర్లో విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది.