గురువారం 28 మే 2020
Cinema - May 16, 2020 , 19:21:27

వీరి పెర్ఫామెన్స్‌తో లాక్‌డౌన్ విష‌య‌మే గుర్తుకురాదు!

వీరి పెర్ఫామెన్స్‌తో లాక్‌డౌన్ విష‌య‌మే గుర్తుకురాదు!

లాక్‌డౌన్ పేరు చెబితేనే ఏడ్చేస్తున్నారు కొంద‌రు. కార‌ణం ఎంజాయ్‌మెంట్‌ను కోల్పోతున్నార‌ని. ఈ వీడియో చూస్తున్నంత‌సేపు లాక్‌డౌన్ అన్న విష‌మ‌యే గుర్తుకురాదు. పాత‌రోజులే గుర్తుకువ‌స్తాయి అంటున్నారు వీక్షించిన వారు. శ్రీ‌ముఖి, విష్ణుప్రియ మంచి స్నేహితులు. వీరు లాక్‌డౌన్‌లో అభిమానుల‌ను అల‌రించ‌డానికి రోజుకో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాటిని సోష‌ల్‌మీడియాలో అప్‌లోడ్ చేసి అల‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఓ వీడియోలో విష్ణుప్రియ‌, శ్రీ‌ముఖి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఇద్ద‌రు అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేశారు. డ్యాన్స్ చేస్తుండ‌గా విష్ణుప్రియ చేసిన కొంటెప‌నులు అభిమానుల‌ను తెగ న‌వ్విస్తున్నాయి. విష్ణుప్రియ‌లో ఇన్నికోణాలున్నాయా అని ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారు. ఈ వీడియో మ‌ళ్లీ మ‌ళ్లీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.logo