బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. ముద్దుముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందంతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తుంది శ్రీముఖి. ఇటీవలి కాలంలో ఈ అమ్మడికి ఆఫర్స్ కాస్త తగ్గాయనే చెప్పాలి. ఏ షోలను కూడా శ్రీముఖి కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాను బాగా నమ్ముకున్న శ్రీముఖి తరచు అందులో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా పొట్టి డ్రెస్లో డిఫరెంట్ జ్యువలెరీ ధరించిన శ్రీముఖి ఫొటో షూట్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ మైకంలో మునిగి తేలుతున్నారు. రీసెంట్గా తన తమ్ముడు సుశృత్తో మేకప్ వేయించుకున్న వీడియో షేర్ చేయగా, ఇది వైరల్గా మారింది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా సత్తా చాటేందుకు కృషి చేస్తుంది.