మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 08:02:23

శ‌ర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్

శ‌ర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్

వ‌ర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆడాళ్ళు మీకు జోహార్లు, మ‌హాస‌ముద్రం చిత్రంతో పాటు శ్రీకారం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా  కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గ్యాంగ్ లీడ‌ర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు.

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’కు వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె. మేయ‌ర్ ‘శ్రీ‌కారం చిత్రానికి కూడా త‌న‌దైన శైలిలో బాణీలు అందించాడు. ఆ మ‌ధ్య చిత్రం నుంచి విడుదలైన ‘సందల్లే.. సందల్లే సంక్రాంతి సందల్లే’, ‘బ‌లేగుంది బాలా’ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శ‌ర్వానంద్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు.  . కీల‌క పాత్ర‌ల‌లో రావు ర‌మేష్‌, సాయికుమార్‌,ఆమ‌ని, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ, స‌త్య, స‌ప్తగిరి, సీనియ‌ర్ న‌రేష్ న‌టిస్తున్నారు. 

VIDEOS

logo