కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు విడుదల చేయడానికి కూడా చాలా మంది నిర్మాతలు భయపడుతుంటే..నాది థియేటర్ సినిమా.. కచ్చితంగా ఆడియన్స్ వస్తారు అంటూ బరిలోకి దిగాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈయన కాన్ఫిడెన్స్ చూసి కొందరు ముచ్చటపడ్డారు.. మరికొందరు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ విమర్శించారు కూడా. అయితే చెప్పింది చెప్పినట్లుగానే ఈ కుర్రాడు చేసి చూపించాడు. ఈయన నటించిన SR కళ్యాణమండపం (SR Kalyana Mandapam) సినిమా సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే. పర్ ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్ గా ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. మూడు రోజుల్లోనే చాలా చోట్ల ఈ సినిమా సేఫ్ జోన్ కు రావడమే కాదు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. మరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో ఓ సారి చూద్దామా..
నైజాం: 1.70 కోట్లు
సీడెడ్: 0.83 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.45 కోట్లు
ఈస్ట్: 0.25 కోట్లు
వెస్ట్: 0.19 కోట్లు
గుంటూరు: 0.36 కోట్లు
కృష్ణా: 0.18 కోట్లు
నెల్లూరు: 0.10 కోట్లు
ఏపీ + తెలంగాణ: 4.06 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.31 కోట్లు
వరల్డ్ వైడ్: 4.38 కోట్లు
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ 4.55 కోట్లకు అమ్మారు. కొత్త హీరోకు ఇంత బిజినెస్ వర్కవుట్ కాదని చాలా మంది విమర్శించారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ వైపు కూడా ప్రేక్షకులు రారు అంటూ డిసప్పాయింట్ చేసారు. కానీ మూడు రోజుల్లోనే నైజాం సహా చాలా ఏరియాల్లో SR కళ్యాణమండపం సినిమా సేఫ్ జోన్ కు వచ్చేసింది. మరో మూడు నాలుగు రోజులు కానీ ఇదే జోరు చూపిస్తే చాలా పెద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి సెకండ్ వేవ్ తర్వాత మొదటి విజయంగా చరిత్ర సృష్టించింది SR కళ్యాణమండపం చిత్రం.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?