ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నవిషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావడంతో బన్నీ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు.ఇటీవల ఫ్యామిలీతో మాల్దీవులకి వెళ్లొచ్చిన బన్నీ ప్రస్తుతం కారులోతన కూతురు, వైఫ్‌ని తీసుకొని లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. బన్నీ స్వయంగా కారు నడుపుతుండగా, కూతురు మొబైల్లో గేమ్స్ ఆడుతూ కనిపించింది. ఈ తతంగాన్ని స్నేహా రెడ్డి షూట్ చేసింది.
వీడియోని స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ చేయగా, ఆవీడియోలో గుచ్చే గులాబిలాగా సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తుంది. ఈ సాంగ్ వింటూ బన్నీ ఎంజాయ్ చేయడం మనం గమనించవచ్చు. ‘గుచ్చే గులాబి లాగా’సాంగ్ రిలీజైన రోజు నుంచే యూట్యూబ్‌లో అందర్నీ ఆకట్టుకుంటూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ , శ్రీమణి సాహిత్యం అదించిన ఈ పాటను బాలివుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించారు.