సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 13:10:00

ద‌స‌రా స్పెష‌ల్: బిగ్ బాస్ స‌ర్‌ప్రైజెస్ మాములుగా లేవు!

ద‌స‌రా స్పెష‌ల్:  బిగ్ బాస్ స‌ర్‌ప్రైజెస్ మాములుగా లేవు!

ద‌స‌రా సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సారం కానున్న బిగ్ బాస్ ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావల‌సినంత ఎంట‌ర్‌టైన్ మెంట్ అందిస్తుంది. ఇన్నాళ్ళు హీరోయిన్‌గా అల‌రించిన స‌మంత ఈ రోజు హోస్ట్‌గా అలరించ‌నుండ‌గా, ఆమెతో పాటు   అఖిల్‌, ఆర్ఎక్స్ 100 హీరో హీరోయిన్స్ కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, జ‌బ‌ర్ధ‌స్త్ ఫేం హైప‌ర్ ఆది  బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. 

తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించి 4.51ని.ల ప్రోమో విడుద‌ల చేశారు. ఈ ప్రోమో వీడియో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. నాగార్జున లేని లోటుని తీర్చేందుకు స‌మంత‌, అఖిల్, హైప‌ర్ ఆది, గీతా మాధురి వంటి సెల‌బ్రిటీలు రాగా, నేటి షో ర‌చ్చ రంబోలా కావ‌డం పక్కా అని ఫ్యాన్స్ డిసైడ్ అవుతున్నారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా సాయంత్రం 6గం.ల‌కు మీ టైంని లాక్ చేసుకొని సంద‌డికి సిద్దం కండి .