బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 16:36:27

ఎస్పీబీ ఆరోగ్యంపై ఆయ‌న త‌న‌యుడి ఆడియో సందేశం

ఎస్పీబీ ఆరోగ్యంపై ఆయ‌న త‌న‌యుడి ఆడియో సందేశం

ఆగ‌స్ట్ 5న క‌రోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో ప్ర‌ముఖ గాయ‌కులు ఎస్పీ బాలసుబ్ర‌హ్యణ్యం చేరిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎప్ప‌టికప్పుడు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. నిన్న‌టి బులిటెన్‌లో బాలు ఆరోగ్యం క్షీణించింద‌ని, ప్ర‌స్తుతం ఐసీయూలో ఉన్నార‌ని చెప్ప‌గానే అంద‌రు కంగారు ప‌డ్డారు. సెల‌బ్రిటీలు సైతం ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేశారు.

బాలు తాజా ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకునేందుకు ప‌లువురు ఎస్పీ చ‌ర‌ణ్‌కి కాల్ చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఒక ఆడియో సందేశం పంపారు. ప్ర‌స్తుతం నాన్న గారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. నిన్న వెంటిలేట‌ర్ ఉంచ‌డం ఆయ‌న‌కి ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. నెమ్మ‌దిగా కోలుకుంటున్నారు. దీనిపై వైద్యులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న కోలుకొని సాధార‌ణ స్థితికి వ‌స్తారు. ఆయ‌న ఆరోగ్యంపై మీకు త‌ప్ప‌కుండా అప్‌డేట్స్ ఇస్తుంటాను అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు.

తాజావార్తలు


logo