శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Aug 25, 2020 , 08:52:02

ఎస్పీబీ ఆరోగ్యం గురించి చ‌ర‌ణ్ ఏమన్నారంటే‌

ఎస్పీబీ ఆరోగ్యం గురించి చ‌ర‌ణ్ ఏమన్నారంటే‌

గ‌త కొద్ది రోజులుగా కరోనాతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. తాజాగా బాలుని ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్ వార్డ్‌లోకి వెళ్లి క‌లిసారు. నాన్న న‌న్ను గుర్తు పట్టారు. అంద‌రు ఎలా ఉన్నార‌ని సంజ్ఞ‌లు కూడా చేశార‌ని వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు చ‌ర‌ణ్‌.

చ‌ర‌ణ్ వీడియోలో మాట్లాడుతూ.. దాదాపు రెండు వారాల త‌ర్వాత నాన్న‌ని క‌లిసా. న‌న్ను గుర్తుప‌ట్టి, కొద్ది సేపు మాట్లాడారు. ఆయ‌న గురించి అంద‌రు చేస్తున్న ప్రార్ధ‌నల గురించి చెప్పాను.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అంద‌రు ప్రార్ధిస్తున్నార‌ని చెప్పుకొచ్చాను. దానికి ఆయ‌న థంబ్స‌ప్ సింబ‌ల్ చూపించారు. అమ్మ‌, నువ్వు ఎలా ఉన్నార‌ని సైగ‌ల‌తో అడిగారు. ఆయ‌న గ‌దిలో ఏర్పాటు చేసిన సంగీతానికి కూడా స్పందిస్తున్నారు. నాన్న చూసి సంతోషించా. ఇక త‌ర‌చు వెళ్ళి క‌లుస్తుంటా. నాన్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్దించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్యవాదాలు. త్వ‌ర‌లో మ‌నంద‌రిని క‌లుస్తారు. నాన్నని కంటికి రెప్ప‌లా చూసుకుంటున్న ఎంజీఎం ఆసుప‌త్రి బృందానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొన్నారు.


logo