బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 22:05:24

‘మీ అంద‌రి ప్రార్థ‌న‌లే ఆయ‌న‌కు కొండంత అండ’‌

 ‘మీ అంద‌రి ప్రార్థ‌న‌లే ఆయ‌న‌కు కొండంత అండ’‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నై ఎంజీఎం దవాఖాన వైద్యులు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు, సినీ ప్ర‌ముఖులు కోరుకుంటున్నారు. బాలు ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆయ‌న సోదరి వ‌సంత మాట్లాడుతూ..అందరికీ న‌మ‌స్కారం..అన్న‌య్య బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి పై చ‌ర‌ణ్ ఇప్ప‌టికే మాట్లాడారు. ఎవ‌రూ కంగారుప‌డొద్దు. ఆయ‌న‌కు విల్ ప‌వ‌ర్ ఉంది. భ‌గ‌వంతుడి ఆశీస్సులు,  మీ అంద‌రి ప్రార్థ‌న‌లతో ఆయ‌న కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగొస్తార‌ని ఆశిస్తున్నా. మీ అందరి ప్రార్థ‌న‌లే ఆయ‌న‌కు కొండంత అండ అని అన్నారు. 

ట్విట్ట‌ర్ లో గెట్ వెల్ సూన్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రారంభించి..మ్యూజిక్ డైరెక్ట‌ర్లు దేవీ శ్రీప్ర‌సాద్‌, ఎస్ థ‌మ‌న్‌, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తోపాటు భార‌తీ రాజా, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ఎస్పీ బాలు త్వ‌ర‌గా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెట్టారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo