శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 22:01:32

ఎస్పీ బాలు కొత్త పాట వైరల్..ఈ స్వరం అతిమధురం

ఎస్పీ బాలు కొత్త పాట వైరల్..ఈ స్వరం అతిమధురం

ఎస్పీ బాలసుబ్రమణ్యం..ఈ పేరును అంత ఈజీగా ఎవరు మరిచిపోతారు చెప్పండి..? సంగీతం ఉన్నన్ని రోజులు కూడా ఈయన అలాగే ఉంటాడు. భౌతికంగా బాలు లేకపోవచ్చు కానీ ఆయన గాత్రం మాత్రం అలాగే ఉంటుంది..చిరస్థాయిగా బాలు పాట అజరామరం. అందుకే ఆయన మరణించి నాలుగు నెలలు దాటిపోయినా ఇప్పటికీ బాలు పాట కోసం అభిమానులు అలా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా బాలు గాత్రం నుంచి జాలువారిన మరో పాట విడుదలైంది. ఆయన ఉన్నపుడు రికార్డ్ చేసిన పాటకు సంబంధించిన వీడియో సాంగ్ ఇప్పుడు విడుదల చేసారు దర్శక నిర్మాతలు.


74 ఏళ్ళ వయసులోనూ ప్రేమపాటను ఆయన ఆలపించిన తీరుకు ఫిదా అవుతున్నారు అభిమానులు. అలాంటి గళం మరొకరికి రాదు.. సాధ్యం కాదు.. బాలు అనేవాడు ఒక్కడే ఉంటాడు.. ఒక్కడిగానే వచ్చాడు.. వెళ్లిపోయాడు అంటూ కన్నీటితో నివాళి అర్పిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఎన్నో వేల పాటలు పాడాడు బాలు. అందులో ఆయన చివరగా పాడిన పాటల్లో ఒకటైన ఎన్నోడా భాషా సాంగ్ ఇప్పుడు విడుదలైంది. దేవదాస్ పార్వతి సినిమాలోని ఈ పాట ఆయన లాక్ డౌన్ మొదలు కాకముందు పాడారు.

అప్పట్లో రికార్డు చేసిన ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను బాలు చనిపోయిన తర్వాత విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ అయింది. అందులో బాలు వాయిస్ విని అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అంత అద్బుతమైన స్వరాన్ని మనకు కాకుండా చేసిన ఆ దేవుడిని కూడా నిందిస్తున్నారు సంగీత ప్రియులు. ఏదేమైనా కూడా బాలు కొత్త పాట మాత్రం యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజ‌ల్

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

సురేంద‌ర్ రెడ్డికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo