e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News సినిమా-బిజినెస్..స‌క్సెస్ బాట‌లో ఉన్న‌ తార‌లు వీళ్లే

సినిమా-బిజినెస్..స‌క్సెస్ బాట‌లో ఉన్న‌ తార‌లు వీళ్లే

ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎంజాయ్ చేసే సినీ సెల‌బ్రిటీల్లో ద‌క్షిణాది తార‌లు ఎప్పుడూ ముందుంటారు.
అభిమానుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేస్తూ..నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తుంటారు. ఓ వైపు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేస్తూనే..మ‌రోవైపు ఇత‌ర వ్యాప‌కాల‌పై దృష్టిపెడుతుంటారు. సౌతిండియా యాక్ట‌ర్ల‌లో కొంద‌రు త‌మ టేస్ట్‌ను బ‌ట్టి, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని బిజినెస్ కూడా ర‌న్ చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు మ‌రోవైపు బిజినెస్‌..ఇలా రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేస్తూ స‌క్సెస్ రూట్‌లో ఉన్న యాక్ట‌ర్ల గురించి ఓ లుక్కేస్తే..

అక్కినేని నాగార్జున‌ :

- Advertisement -


యంగ్ హీరోల‌తో ఏ మాత్రం తీసిపోని విధంగా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వారికి గ‌ట్టి పోటీనిస్తున్నాడు అక్కినేని నాగార్జున‌. ఈ అక్కినేని హీరోకు జూబ్లీహిల్స్ లో రెస్టో బార్ ఉంది. అంతేకాదు ఎన్-గ్రిల్‌, ఎన్‌-ఆసియ‌న్‌, ఎన్‌-క‌న్వెన్స‌న్ సెంట‌ర్ ల‌కు కో ఓన‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రాంచ‌ర‌ణ్ :


మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చి మ‌గ‌ధీర సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేశాడు రాంచ‌ర‌ణ్. పాన్ ఇండియా స్థాయికి వెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్న రాంచ‌ర‌ణ్ కు సినిమాల‌పైనే కాకుండా బిజినెస్ లోనూ మంచి ప‌ట్టుంది. రాంచ‌ర‌ణ్ హైద‌రాబాద్ ఎయిర్ లైన్ ట్రూజెట్ కు ఓన‌ర్. ట‌ర్బో ఏవియేష‌న్ లో భాగంగా ట్రూజెట్ ఎయిర్ లైన్ కొన‌సాగుతుంది. దీంతోపాటు హైద‌రాబాద్ పోలో అండ్ రైడింగ్ క్ల‌బ్ ను స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హిస్తున్నాడు.

రానా :


బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రానా ద‌గ్గుబాటి. ఈ యాక్ట‌ర్ ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో కొన‌సాగుతూనే..మ‌రోవైపు CAA KWAN పేరుతో టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నిర్వ‌హిస్తున్నాడు.

త‌మ‌న్నా :

ఈ ముంబై భామ‌ను తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులంతా ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. రెండు భాష‌ల్లో స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించి వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న త‌మ‌న్నా మ‌రోవైపు బిజినెస్ లో కూడా ఉంది. వైట్ అండ్ గోల్డ్ పేరుతో ఆన్‌లైన్ జ్యువెల‌రీ వ్యాపారాన్ని కొన‌సాగిస్తోంది.

తాప్సీ :

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించి..ఇపుడు హిందీపై ఫోక‌స్ పెట్టింది ఢిల్లీ సుంద‌రి తాప్సీ. ఈ భామ‌కు ది వెడ్డింగ్ మేనేజ్ మెంట్ కంపెనీ ది వెడ్డింగ్ ఫ్యాక్ట‌రీ ని నిర్వ‌హిస్తోంది. తాప్సీ త‌న సోద‌రి శ‌గున్ ప‌న్ను, ఫ్రెండ్ ఫ‌రా ప‌ర్వ‌రేశ్ తో క‌లిసి ర‌న్ చేస్తోంది.

విజ‌య్ :

ద‌క్షిణాదిన అద్బుత‌మైన స్టార్ డ‌మ్ ఉన్న యాక్ట‌ర్ల‌లో వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరో విజ‌య్‌. ఈ స్టార్ హీరోకు అత‌ని త‌ల్లి శోభ‌, స‌తీమ‌ణి సంగీత‌, కొడుకు సంజ‌య్ పేరు మీద చెన్నైలో వెడ్డింగ్ హాల్స్ ఉన్నాయి. దీంతోపాటు ప‌లు ర‌కాల సైడ్ బిజినెస్ లు కూడా స‌క్సెస్ ఫుల్ గా మెయింటైన్ చేస్తున్నాడు విజ‌య్‌.

ఆర్య‌:

వ‌రుడు, సైజ్ జీరో చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కోలీవుడ్ స్టార్ ఆర్య‌. ఈ హీరోకు సీ షెల్ పేరుతో సౌతిండియ‌న్ రెస్టారెంట్ ఉంది. అంతేకాదు ది షో పీపుల్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌజ్ కూడా ఉంది. ఈ బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే ప‌లు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా నిర్మించి స‌క్సెస్ ఫుల్ బిజినెస్ చేస్తున్నాడు

ఇవి కూడా చదవండి..

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. క‌ళా ద‌ర్శ‌కుడు మృతి

అభిమానులు ఇంటికి రావ‌డం నాకు న‌చ్చ‌దు: ర‌ష్మిక‌
ఫాలోవ‌ర్లు, ఫ్యాన్స్ కు కొర‌టాల శివ షాక్‌

‘మా’ ఎన్నిక‌లు..ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు వీళ్లే

సెట్‌లో స‌న్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్‌..వీడియో

‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్ర‌శ్న‌..వీడియో వైర‌ల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana