ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా లేడి డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం ఆకాశం నీ హద్దురా. తమిళంలో ఈ చిత్రం సూరారై పోట్రు పేరుతో విడుదలైంది. కరోనా వలన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయగా, మూవీ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌కు పరిశీనకు కూడా వెళ్లింది కాని నామినేషన్లో చోటు దక్కించుకోలేకపోయింది.
తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ మూవీని షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్లో పానరోమా విభాగంలో ప్రదర్శించనున్నారు. మరోవైపు అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ ‘ఐఎండీబీ’లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా ఈ సినిమా ఘనత సాధించడం సూర్య అభిమానులకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే… మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ కూడా షాంఘై ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికైంది. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు–తమిళ భాషల్లో కన్నన్ దర్శకత్వంలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించనున్నారు.