శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 17:09:20

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

దేశ‌వ్యాప్తంగా వేలాదిమందికి అండ‌గా నిలిచి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు వెండితెర విల‌న్ సోనూసూద్‌. అయితే రియ‌ల్ హీరోగా ప్ర‌శంస‌లందుకుంటున్న సోనూసూద్ ను ఇక తెర‌పై నెగెటివ్ రోల్ లో చూసేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు ఫాలోవ‌ర్లు. మెల్ల‌మెల్ల‌గా రీల్ లైఫ్ హీరోగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. సోనూసూద్ తాజాగా తొలిసారి ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించాడు. సింగ‌ర్ సునంద శ‌ర్మతో క‌లిసి పాగ‌ల్ న‌హీ హోనా మ్యూజిక్ వీడియోలో న‌టించాడు.


ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య‌ రొమాంటిక్ గా సాగుతుందీ పాట‌. సోనూసూద్ ఆర్మీ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌గా..అత‌న్ని ప్రేమించే యువ‌తిగా సునంద శ‌ర్మ న‌టించింది. ప‌ట్ట‌ణానికి దూరంగా సోనూసూద్ కు పోస్టింగ్ వ‌స్తోంది. అయితే సునంద త‌న ప్రియుడు తిరిగొచ్చే వ‌ర‌కు వెయిట్ చేస్తుంది. చివ‌రికి ఇద్ద‌రు క‌ల‌వ‌డంతో వీడియో ముగుస్తుంది. పింకీ ధ‌లివాల్-మ్యాడ్ 4 మ్యూజిక్ సంయుక్తంగా స‌మ‌ర్పిస్తున్న ఈ పాట‌ను జాని రాయ‌గా..అవ్విస్రా కంపోజ్ చేశారు. 

ఇది నా తొలి మ్యూజిక్ వీడియో. కాన్సెప్ట్ విన‌గానే వెంట‌నే ఒకే చెప్పాను. పాగ‌ల్ న‌హీ హోనా సాంగ్ ను ఆర్మీ జ‌వాన్ల‌కు, వారి ప్రేమించే వారికి అంకిత‌మిస్తున్నా. పాట లిరిక్స్ మీ మ‌న‌స్సును హ‌త్తుకుంటాయి. సునంద చాలా అందంగా పాడింది అంటూ సోనూసూద్ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చ‌ద‌వండి

కృతిస‌న‌న్‌ క‌విత్వానికి నెటిజ‌న్లు ఫిదా

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo