బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 14:41:29

సోనూసూద్ స‌మాధానంతో బిత్త‌ర‌పోయిన నెటిజ‌న్

సోనూసూద్ స‌మాధానంతో బిత్త‌ర‌పోయిన నెటిజ‌న్

ఆప‌ద‌లో ఉన్న‌వారికి అండ‌గా ఉంటూ అంద‌రిచేత ప్ర‌శంస‌లు అందుకుంటున్న రియ‌ల్ హీరో సోనూసూద్. లాక్ డౌన్ స‌మ‌యం నుండి ఇప్ప‌టి వ‌రకు సోనూసూద్ త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్విరామంగా కొన‌సాగిస్తున్నారు. అయితే కొంద‌రు ఆక‌తాయిలు సోనూసూద్ చేసే సేవ‌ల‌ని గుర్తించ‌కుండా సోష‌ల్ మీడియాలో సెటైరిక‌ల్ ట్వీట్స్ చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు.

సోనూసూద్ కరోనా క‌ష్ట కాలంలో ఎంతో మందిని బ‌స్సు, రైళ్ళు, విమానాల ద్వారా సొంతింటికి చేర్చారు.  ఈ క్ర‌మంలో ఓ నెటిజన్..  సర్.. నాకు మాల్దీవులు వెళ్లాలని ఉంది. దయచేసి నాకు సహాయం చెయ్యండి` అని సోనూను ట్యాగ్ చేస్తూట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సోనూ.. `భయ్యా.. నీకు సైకిల్ కావాలా? రిక్షా కావాలా?` అని అడిగాడు . దీంతో ఆ నెటిజ‌న్ బిత్త‌ర‌పోయాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఇటీవ‌ల అల్లుడు అదుర్స్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సోనూసూద్ బీబీ 3లో విల‌న్‌గా క‌నిపించనున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.