చేతికి ఎముక లేదన్నట్టు అడిగిన వారందరికి సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు సోనూ సూద్. గత ఏడాది తన సొంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిన సోనూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సినిమాలలో విలన్ వేషాలు వేసినప్పటికీ అతను రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. సోనూసూద్ సేవా దృక్పథానికి ఇంప్రెస్ అయిన యశ్వంత్ అనే కళాకారుడు నోటితో పెయింట్ బ్రష్ పట్టుకొని సోనూసూద్ బొమ్మని అద్భుతంగా గీసాడు.
మీ సేవా తత్పరత నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. మీరు చాలా మందికి స్పూర్తిగా నిలిచారంటూ యశ్వంత్ తను బొమ్మ గీసిన వీడియోని షేర్ చేశాడు. ఇది చూసిన సోనూసూద్ ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పక కలుస్తానంటూ ట్వీట్ చేశాడు. సోనూసూద్ ట్వీట్‌తో ఆ కళాకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, సోనూసూద్ ఇటీవల ఆక్సిజన్ సిలిండర్లు పంపి ఏకంగా 22 మంది ప్రాణాలు కాపాడగా, తాజాగా తన టీం ను పంపి 30 మంది కొవిడ్ -19 రోగుల ప్రాణాలు నిలిచేలా చేశాడు.