శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 10:29:12

అక్ష‌య్, బిగ్ బీల‌ని బీట్ చేసిన సోనూసూద్

అక్ష‌య్, బిగ్ బీల‌ని బీట్ చేసిన సోనూసూద్

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం దాదాపు మూడు నెల‌ల లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న ఉపాధి లేక చాలా మంది అవ‌స్త‌లు ప‌డ్డారు. వ‌ల‌స కూలీలు సొంతింటికి వెళ్ళేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి ప‌రిస్థితుల‌ని గ‌మ‌నించిన సోనూసూద్ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ముంబైలోని త‌న హోట‌ల్‌ని వైద్య‌సిబ్బందికి కేటాయించిన సోనూసూద్ వ‌ల‌స కార్మికుల‌ని సొంతింటికి పంపేందుకు బ‌స్సులు ఏర్పాటు చేశాడు. ఆప‌ద‌లో ఉన్న‌వారికి త‌న వంతు సాయం చేశాడు. వెండితెర‌పై విల‌న్‌గా అల‌రించిన సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బి) లాక్‌డౌన్ స‌మ‌యంలో సేవ‌లు చేసిన  ప్రముఖుల పనితీరుపై ఒక సర్వే నిర్వహించింది .ఇందులో బాలీవుడ్ నటుడు సోను సూద్  జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు, తరువాత అక్షయ్ కుమార్ , అమితాబ్ బచ్చన్ వరుసగా రెండవ మరియు మూడవ స్థానాల్లో ఉన్నారు.


logo