శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 15, 2020 , 13:36:07

పుస్త‌కం రాస్తున్న సోనూసూద్.. అంశం ఏమంటే ?

పుస్త‌కం రాస్తున్న సోనూసూద్.. అంశం ఏమంటే ?

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ క‌రోనా స‌మ‌యంలో వ‌ల‌స కూలీల‌కి దేవుడిలా మారాడు. వారు ప‌డుతున్న ఇబ్బందుల‌ని తెలుసుకొని సొంత ఖ‌ర్చుల‌తో ఇళ్ళ‌కి చేర్చాడు. ఇందుకోసం బ‌స్సులు, రైళ్లు, చార్ట‌ర్డ్ ఫ్లైట్స్ ఎంచుకున్నాడు. అలానే ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి వలస కార్మికులకు పేదలందరికీ ఉచితంగా ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నాడు.  స్తోమ‌త‌ని మించి సాయం చేసి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న సోనూసూద్ వ‌ల‌స కార్మికుల‌తో త‌న అనుభ‌వాల‌ని పుస్త‌క రూపంలో మ‌ల‌చాల‌ని భావిస్తున్నాడు.

లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికులు ప‌డ్డ క‌ష్టాలు, బ‌స్సు ఎక్కి సొంతింటికి వెళుతున్నామ‌నే స‌మ‌యంలో పొందిన ఆనందం, వ‌ల‌స కార్మికులతో గంట‌ల కొద్ది గ‌డిపిన క్ష‌ణాలు ఇలా ప్రతీది నా మ‌న‌సుని ట‌చ్ చేశాయి. ఈ మూడున్న‌ర నెల‌లో నేను ఎన్నో అనుభ‌వాలు పొందాను. వారికి సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. వ‌ల‌స కార్మికుల‌తో నా అనుభ‌వాల‌ని పుస్త‌క రూపంలో తెస్తాను. ఈ పుస్త‌కాన్ని పెంగ్విన్ రాండ‌మ్ హౌజ్ ఇండియా ప్ర‌చురిస్తుంద‌ని సోనూసూద్ పేర్కొన్నారు 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo