గురువారం 02 జూలై 2020
Cinema - May 25, 2020 , 12:44:21

కేవలం 2 రూపాయలకే ఫేస్‌మాస్క్‌ రెడీ : సోనూసూద్‌

కేవలం 2 రూపాయలకే ఫేస్‌మాస్క్‌ రెడీ : సోనూసూద్‌

రీల్‌ లైఫ్‌లో విలన్‌ అయినా రియల్‌ లైఫ్‌లో హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి గ్రామాలకు తరలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అందుకు సోనూసూద్‌పై స్మృతి ఇరానీ ప్రసంశల వర్షం కురిపించింది. అలాగే పేద ప్రజలకు తన హోటల్‌లో వసతి కల్పిస్తూ ప్రతిరోజూ ఆహార బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. ఈ మంచి పనులే కాకుండా ఇప్పుడు ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తనదైన శైలిలో ఫేస్‌మాస్క్‌ తయారు చేసి చూపిస్తున్నాడు పశుపతి. ‘2 రూపాయల ప్లాస్టిక్‌ ఫైల్‌ తీసుకొని దాన్ని రెండింటిగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత స్టాప్టెర్‌ తీసుకొని ఒక కవర్‌కి అటు చివర ఒక రంధ్రం, ఇటువైపు మరొక రంధ్రం వేయాలి. ఇప్పుడు సన్‌గ్లాస్‌ తీసుకొని రెండు రంధ్రాల్లో సెట్‌చేసి కళ్లకు పెట్టుకుంటే సరి. ముఖమంతా కవర్‌ అయ్యేలా మాస్క్‌ రెడీ! మాస్క్‌ తయారీ విధానాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు సోనూ. సోనూసూద్‌ చేస్తున్న మంచి పనులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.


logo