గతేడాది కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ కష్టాల్లో ఉన్న వాళ్లకు ఆపద్బాంధవుడు అయ్యాడు నటుడు సోనూ సూద్. ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇస్తుండటంతో సాయం కావాలంటూ దేశం నలుమూలల నుంచీ అతనికి వేల సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని టైంపాస్ మెసేజ్‌లు కూడా ఉంటాయి. వాటిని సోనూ కూడా మరీ సీరియస్‌గా తీసుకోకుండా.. అలాంటి సాయం అడిగిన వాళ్లకు తనదైన స్టైల్లో ఫన్నీగా రిప్లై ఇస్తున్నాడు. ఏమైనా సాయం కావాలంటే అడగండి అని ఆపదలో ఉన్న వారికి సోనూ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతోంది.. అదేమైనా సాయం చేస్తారా అని అడిగాడు. దానికి సోనూ స్పందిస్తూ అది అవుతుందో లేదో గానీ, ఐఫోన్ ఇస్తే మాత్రం నీకు ఏమీ మిగలదు అని రిప్లై ఇచ్చాడు.