శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 16, 2021 , 15:58:21

సోనూసూద్ టైల‌రింగ్ షాప్‌.. క‌స్ట‌మ‌ర్ దుస్తుల‌కు నో గ్యారంటీ! ..వీడియో వైర‌ల్‌

సోనూసూద్ టైల‌రింగ్ షాప్‌.. క‌స్ట‌మ‌ర్ దుస్తుల‌కు నో గ్యారంటీ! ..వీడియో వైర‌ల్‌

ముంబై: స‌మాజ‌సేవా కార్యక్రమాలతో దేశంలో రియల్ హీరోగా మారిన నటుడు సోనూసూద్​.. ఎప్పుడూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంటాడు. తన అభిమానులను అలరించే అవ‌కాశ‌మున్న ఏ ఒక్క‌ అవకాశాన్ని ఆయన వదులుకోవ‌డంలేదు. సినిమాలతోనేగాక‌ సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్​ను ఆనందిపజేస్తుంటారు. తాజాగా ఆయ‌న‌ ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఆ వీడియోలో సోనూసూద్ టైలర్​ అవ‌తార‌మెత్తారు. ప్యాంట్ కుట్టేందుకు ప్రయ‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. 

ఇటీవ‌ల అచార్య‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సోనూసూద్‌.. లొకేషన్​లో ఉన్న ఓ క్లాత్ తీసుకొని ప్యాంట్​ కుట్టేందుకు ప్రయత్నించారు. అయితే అది అనుకున్నట్టు రాకపోవడంతో ఫన్నీ కామెంట్​తో ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. 'సోనూసూద్ టైలరింగ్ షాప్. ఇక్కడ దుస్తులు ఉచితంగా కుడతాం. అయితే ప్యాంట్‌లు నిక్కర్లు అవుతాయేమో.. ఆ విషయంలో గ్యారెంటీ లేదు' అని సోనూసూద్ రాసుకొచ్చారు. కాగా, ఈ వీడియోకు ల‌క్ష‌ల్లో వ్యూస్, లైకులు, కామెంట్లు వస్తూనే ఉన్నాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo