శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 00:21:11

‘అల్లుడు అదుర్స్‌' సినిమా సెట్‌లో సోనూసూద్‌

‘అల్లుడు అదుర్స్‌' సినిమా సెట్‌లో సోనూసూద్‌

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా సంతోష్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌'. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. నభా నటేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. కొద్దిరోజుల క్రితమే షూటింగ్‌ పునఃప్రారంభమైంది. ఈ చిత్రంలో సోనూసూద్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన  షూటింగ్‌లో ఆయన జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, త్వరలో టీజర్‌ను రిలీజ్‌ చేస్తామని..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షక్షకులముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. ప్రకాష్‌రాజ్‌, సోనూసూద్‌, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, సత్య, చమ్మక్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సమర్పణ: రమేష్‌కుమార్‌ గంజి.


logo