e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News తెలుగు రాష్ట్రాల‌కు సోనూసూద్ పెద్ద సాయం

తెలుగు రాష్ట్రాల‌కు సోనూసూద్ పెద్ద సాయం

తెలుగు రాష్ట్రాల‌కు సోనూసూద్ పెద్ద సాయం

క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ వ‌ల‌న పేద‌ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. వారి బాధ‌ల‌ను గుర్తించిన సోనూసూద్ అడ‌గ‌క‌ముందే సాయాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్ర‌మంలో ఇండియన్ రియల్ సూపర్ హీరోగా నిలిచాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో మ‌హ‌త్త‌ర సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నారు సోనూసూద్. ఇందులో సానికిరెడ్డి పల్లి ఆషాపూర్ బోంకూర్ ఓర్వకల్ మడ్డికేరా మరియు ఇంకా చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో అనేక గ్రామ సర్పంచ్లు సహాయం కోసం సోనుసూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ సూద్ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.వాటిని సమకూర్చారు. త్వరలోనే ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలుగు రాష్ట్రాల‌కు సోనూసూద్ పెద్ద సాయం

ట్రెండింగ్‌

Advertisement