గురువారం 02 జూలై 2020
Cinema - Jun 05, 2020 , 08:32:39

సోనూసూద్ సేవ‌లకి పులిస్టాప్ లేదు..!

సోనూసూద్ సేవ‌లకి పులిస్టాప్ లేదు..!

వెండితెర‌పై విల‌నిజంతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో హీరోగా కొల‌వ‌బ‌డుతున్నాడు. ఆయ‌న సేవ‌ల‌ని చూసి హిందీ ప‌రిశ్ర‌మ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు షాక్ అవుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వైద్య సిబ్బందితో పాటు వ‌ల‌స కార్మికుల‌కి సాయం చేసిన సోనూసూద్ తాజాగా తుఫాను ప్ర‌భావం నుండి వేలాది మందిని కాపాడి మంచి మ‌న‌సు చాటుకున్నారు. 

నిస‌ర్గ తుఫాను వ‌ల‌న తీర ప్రాంతాల‌లోని సామాన్య జ‌నం అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. వీరి పరిస్థితుల‌ని అర్ధం చేసుకున్న సోనూసూద్ దాదాపు 28 వేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కి త‌ర‌లించి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. క్లిష్ట ప‌రిస్థితుల‌లో మ‌నిషికి మ‌నిషే సాయం. తుఫాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో నేను నా బృందం తీర ప్రాంతాలలోని 28వేల మందిని పున‌రావాస కేంద్రాల‌కి త‌ర‌లించి ఆహారం అందించాం. ముంబైలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీ వలస కార్మికులను షెల్టర్‌ హోంకు త‌ర‌లించాం అని సోనూసూద్ పేర్కొన్నారు. క‌ష్ట స‌మ‌యాల‌లో సోనూ సూద్ చూపిస్తున్న ఔదార్యంపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆయ‌న‌ని దేవుడిగా అభివ‌ర్ణిస్తున్నారు. 


logo