బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 21:07:15

సోనూసూద్‌ డిమాండ్‌ పెరిగింది..!

సోనూసూద్‌ డిమాండ్‌ పెరిగింది..!

హైదరాబాద్‌ : కష్టాలో ఉన్నవారిని ఆదుకుంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సినీనటుడు సోనూసూద్‌. ఇటీవల తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన చేసిన మూడు లక్షల ఉద్యోగాల ప్రకటన సైతం నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహన్ని నింపింది. వెండితెరపై విలన్‌గా కనిపించే ఈ నటుడు మంచి మనసుతో అందరి దృష్టిలో హీరోగా మారాడు. ఎలాంటి స్వార్థం లేకుండా సోనూసూద్‌ చేసిన గొప్పపనులు ఆయన్ని మరింత ఎత్తుకు ఎదిగేటట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం సోనూసూద్‌ పాపులారిటీని, వ్యక్తిగత ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్‌ కంపెనీలు, ప్రముఖ వ్యాపారసంస్థలు వాణిజ్య ప్రకటనల్లో నటించాల్సిందిగా భారీ పారితోషికం ఆఫర్‌ చేస్తున్నాయట.! అయితే సోనూ మాత్రం ఇందుకు సంసిద్ధంగా లేరని తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ప్రకటనల్లో నటించనని సున్నితంగా తిరస్కరిస్తున్నారట. ఒకవేళ నటించినా వచ్చే ఆదాయంలో ఎక్కువశాతం పేదల అభ్యున్నతికి ఖర్చుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.logo